Bigg Boss 7 Telugu Day 9 Highlights । ప్రశాంత్ పై మూకుమ్మడి దాడి : రతిక వెంట తిరగడానికి వచ్చావా ??

నిన్న ప్రశాంత్ నామినేషన్స్ మధ్యలో ముగిసిన ఎపిసోడ్ , ఈరోజు కూడా ప్రశాంత్ ని నామినేట్ చేయడంతోనే మొదలైంది Bigg Boss 7 Telugu Day 9. 

బిగ్ బాస్ కి వచ్చింది రతిక వెంట తిరగడానికా:

శోభ శెట్టి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ నువ్వు డబుల్ దిమాక్ తో ఉంటావు. బిగ్ బాస్ కు వచ్చింది ఎందుకు రతికతో లవ్ అని ఎందుకు వెంటపడుతున్నావ్, రతిక వెంట పడటానికి వచ్చావా అని విరుచుకు పడింది బయట మా వొళ్ళు ఉన్నారు చూసుకుంటారు అనగానే ఆ ఇపుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అంటూ అమర్,రతిక, శెట్టి అంటారు.

రతిక ప్రశాంతిని నామినేట్ చేస్తూ నువ్వు రైతుబిడ్డ అనే సానుభూతితో బిగ్ బాస్ కి దారి వేసావ్ అన్ని బిగ్ బాస్ షోలు చూసి ఇక్కడికి వచ్చావు మళ్లీ చూడట్లేదు అని యాక్టింగ్ చేస్తున్నావు బిగ్ బాస్ హౌస్ లో వినమ్రత అనేది లేదు నీకు అవకాశం కోసం ఒకలా అవకాశం వచ్చాక ఇంకోలా ఉంటావు నీ ఒరిజినాలిటీ తెలిసాక ప్రేక్షకులే బయటకు పంపిస్తారు.

Bigg Boss 7 Telugu Day 9
Bigg Boss 7 Telugu Day 9

నాకు గౌరవం కావాలి అందుకే:

శుభశ్రీ కూడా ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ నువ్వు మాట్లాడే విధానం నా వృత్తికి గౌరవం ఇచ్చేలా లేదు నిన్ను చూస్తే భయమేస్తుంది బిగ్ బాస్ ఇప్పుడే పంపిస్తే ఏం తీసుకోకుండా వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్లిపోతాను ఈ మధ్యలో బజర్ నొక్కగానే అన్ని చుక్కలు ఒకవైపు చంద్రుడు ఒకవైపు అనే లిరిక్స్ పాడుకుంటూ తడుస్తాడు.

గెలకనికే చూస్తుండు :

ప్రశాంత్ నామినేషన్ ముగిసిపోయాక దామిని, రతికతో ఈ లవ్ ట్రాక్ బిగ్ బాస్ లో ఉండటానికే నడిపిస్తున్నాడు అని అందరికీ తెలుసు అలాగే ఏదైనా ఎజెండాతో బిగ్ బాస్ లోకి వస్తే బాగుంటుంది దామిని అంటుంది.  ప్రశాంత్ ఏడుస్తుంటే మళ్ళీ నామినేట్ చేసిన వారే వచ్చి ఓదార్చుతున్నారు. నేను ఒక్కడినే అంటే రైతులందరినీ అన్నట్టుగా చూపిస్తున్నావని తేజ అంటే, నేను ఎలా ఉంటే మీకేంటి మీ గేమ్ మీరు ఆడండి అంటే మీ పరిస్థితి ఏంటిరా అని శివాజి అందరిని ప్రశ్నిస్తాడు.

ప్రశాంత్ గౌతమ్ ని నామినేట్ చేస్తూ శుభ శ్రీ తో  చెవిలో మాట్లాడింది అ రోజే నాగ్ సర్ ముందు  చెప్తే ఐపోయేది . ఒక్కరితో  దగ్గర చెప్పే బదులు అందరి ముందు చెప్తే బాగుండేది  అందుకే నామినేట్ చేస్తున్నా.

(2 వ వారం నామినేషన్స్ ప్రారంభం : మీ ఫేవరెట్ కంటేస్టెంట్ కి ఓట్ వేశారా ? ఇక్కడ క్లిక్ చేసి వోటు వేయండి)

ప్రశాంత్ పై మూకుమ్మడి దాడి చేసినట్టు కాదు నాపైకి రావడం :

Bigg Boss 7 Telugu Day 9 Highlights లో శోభ శెట్టిని శివాజీ నామినేట్ చేస్తూ నువ్వు నన్ను నామినేట్ చేసావని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంతే తప్ప ఎవరిదో కారణన్ని  రీసన్ గా చెప్పడం నాకు నచ్చలేదు అందరూ ముకుమ్మడిగా దాడి చేసినట్టు కాదు నాతో అలా కుదరదు శివాజీ అంటాడు. మీరు పెద్దవారు కాబట్టి మీకు గౌరవించి మాట్లాడుతున్న అమ్మా కొత్త కాన్సెప్ట్ ఉంటే తీసుకో ఇది సెట్ కాదు అంటూ శెట్టి, శివాజీ మధ్య వాగ్వాదం జరుగుతూ ఉన్నది
నేను యాక్టర్ ని నాకు నటన వచ్చు .అంటే మరి ఇంప్రెస్ చేయలేదు కదా టాస్క్ గురించి సరిగా తెలియదు ఏమీ తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్ అని శివాజీ అంటాడు.

గర్ల్స్ ,బాయ్స్ సమానం కాదు ఇక్కడ:

షకీలాను ప్రిన్స్ నామినెట్ చేస్తూ నేను డీలక్స్ రూమ్ లో పడుకోవడానికి వస్తే ఇక్కడ గర్ల్స్ ఉన్నారు అని వెళ్ళిపొమ్మన్నారు ఎక్కడైనా గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ బాయ్స్ అని లేదు కదా అని అంటే షకీలా వివరణ ఇస్తూ ఇక్కడ గర్ల్స్ మాత్రమే ఉన్నారు అందుకే చెప్పాను ఇక్కడ గర్ల్స్ బాయ్స్ సమానంగా లేదు కదా అందుకే వెళ్లిపోమన్నాను.

Bigg Boss 7 Telugu Day 9 నామినేషన్స్ లో  శుభశ్రీని ,ప్రియాంకని ఎవరు నామినెట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

Bigg Boss 7 Telugu Day 9  లో మళ్లీ బెడ్ లొల్లి:

గౌతమ్ రతిక ను నామినేట్ చేస్తూ నిన్న బెడ్ విషయంలో నీ వలన గొడవ జరిగింది కాబట్టి నామినేట్ చేస్తున్న అంటే నువ్వు మైక్ లేకుండా గుసగుసలాడేది కూడా అందరికీ తెలుసు కదా నా గురించి మాట్లాడినవని అని రతిక అంటే గౌతం అయినా నువ్వు ఇద్దరి మధ్య గొడవ పెట్టావు కదా ఇది తప్పు కాదా ఇద్దరి మధ్య మెల్లగా మొదలైన వాదన అరచుకోవడం వరకు వచ్చింది అంటే నువ్వు అరుస్తే నాకు నోరు లేదా అనే విధంగా ఉంది.

నన్ను ఫిజికల్ అభ్యూస్ చేస్తున్నావ్:

తేజ రతిక ను నామినేట్ చేస్తూ ఇసుక టాస్క్ లో ప్రతిసారి బోండాం బోండాం అంటున్నావు నాకు నచ్చదని చెప్పినా కూడా అంటున్నావ్ నన్ను ఫిసికల్ గా అబ్యూస్ చేస్తున్నావ్ అందుకే నామినేట్ చేస్తున్న. అంటే నువ్వు నన్ను చెంప పైన కొట్టలేదా. అబ్బాయిలు అమ్మాయిలు ఎంత క్లోజ్ గా ఉన్నా చెంప మీద కొడితే ఒప్పుకుంటారా అంటే నువ్వు చేసింది తప్పు కాదాఅంటుంది రతిక , సారీ సారీ ఫిజికల్ అభ్యూస్ కాదు బాడీ షేమింగ్ చేస్తున్నావు నాకు ఇంగ్లీష్ సరిగా రాదు అయినా నీ వలనే కదా బెడ్ కోసం ఇంట్లో రచ్చ రచ్చ జరిగింది అంటాడు టేస్టి తేజ .

Bigg Boss 7 Telugu Day 9 ప్రిన్స్ అమర్దీప్ ని నామినేట్ చేస్తూ చివరివారం నువ్వు రిస్ట్రిక్షన్ ఏరియాకు వెళ్లినందుకే నన్ను నామినేట్ చేసావ్ ఈవారం నువ్వు కూడా అదే తప్పు చేశావు అందుకని నామినేట్ చేస్తున్న.

చెప్పింది చెయ్ శివాజీ : బిగ్ బాస్

Bigg Boss 7 Telugu Day 9 Highlights లో బిగ్ బాస్ మాట్లాడుతూ శివాజీ మీరు రెండవ నామినేషన్ వేయండి అని అడుగుతే నేను వేయను బిగ్ బాస్ ఆల్రెడీ నేను నామినేషన్ లో ఉన్నాను కాబట్టి ఇంకొకరిని నామినేట్ చేయదలచుకోలేదు అంటే బిగ్ బాస్ బలవంతంతో అమర్దీప్ ని రెండవ నామినేషన్ వేశాడు.

ఈ వారం నామినేషన్స్ సభ్యులు;

Bigg Boss 7 Telugu Day 9 ఈ వారం  నామినేషన్ లో ఉన్నవారు శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్, షకీలా ,గౌతమ్, శోభ మరియు ప్రిన్స్.

సేఫ్ గేమ్ ఆడకు సందీప్ : బిగ్ బాస్

వీఐపీ రూమ్ కేవలం కన్ఫర్మ్ డు సభ్యుల కు మాత్రమే కేటాయించబడిందని ఇంకోసారి బిగ్ బాస్ సందీప్ కి తెలియజేస్తాడు అలాగే డీలక్స్ రూమ్, స్టాండర్డ్ రూమ్ ఇంటి సభ్యులలో ఎవరెవరికి కేటాయిస్తారో ఆ బాధ్యత సందీప్ కి అప్పగిస్తాడు. సందీప్ డీలక్స్ రూమ్ లో షకీలా, దామిని, శివాజీ, శుభశ్రీ లకు కేటాయిస్తే శోభ శెట్టి మాట్లాడుతూ షకీలా, దామిని, శివాజీకి డీలక్స్ రూమ్ కేటాయించడంలో కారణం చెప్పారు కానీ శుభ శ్రీ కి ఎందుకిచ్చారు చెప్పండి అని అడుగుతుంది. దానికి వివరణ ఇస్తూ అదేం పర్వాలేదు ఇక్కడ ఎవరికో ఒకరికి ఇవ్వాలని ఇచ్చాను అంతే తప్ప ఏం లేదు అని సేఫ్ గేమ్ ఆడతాడు. స్టాండర్డ్ రూంలో మిగతా సభ్యులైన గౌతం ,శోభ, రతిక ,ప్రియాంక, ప్రిన్స్, ప్రశాంత్, తేజ ల కి కేటాయిస్తాడు. Bigg Boss 7 Telugu Day 9 లో బిగ్ బాస్ మాట్లాడుతూ సందీప్ సేఫ్ గేమ్ ఆడింది ఇక చాలు సింగిల్ బెడ్ ఒకరికి డబుల్ బెడ్ ఇద్దరికి ఇవ్వాలి అలాగే మీరు కేటాయించిన బెడ్ లో వారే పడుకునేలా చూసుకునే బాధ్యత కూడా మీదే అని చెప్తాడు.

మాయాస్త్రం కథ:

Bigg Boss 7 Telugu Day 9 Highlights లో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ కి మంచి చెడుల మధ్య జరిగే యుద్ధం గురించి తెలియజేస్తాడు విక్రుత చేష్టలు చేసే వ్యక్తులు ఉంటారని మంచివైపు ఒక మాయా లాంటిది ఉంటుందని మంచివారు ఆ మాయా అస్త్రన్ని తయారుచేసి భూమి లోపల దాచిపెడతారని ఆ విధంగా భూమిపై వికృతి చేష్టల వలన ఉల్టా, పుల్టా జరుగుతుందని ఇప్పుడు ఆ మాయాస్త్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నదని తెలియజేస్తూ ఇంటి సభ్యులను రెండు సమూహాలుగా విడగొడతాడు.

Bigg Boss 7 Telugu Day 9
Bigg Boss 7 Telugu Day 9

Bigg Boss 7 Telugu Day 9 ఇక తన్నుకోండి:

ఒకటి రణధీర టీముగా ఇందులో అమర్దీప్ ,శివాజీ యావర్, ప్రియాంక, శోభ ,షకీలా ఉంటారు .
రెండవ టీం లో మహాబలి లో ప్రశాంత్, గౌతం, తేజ, రతిక ,శుభశ్రీ ఉంటారని తెలియజేస్తారు. సమయానుగుణంగా వారి వారి బలాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది అని చెప్తాడు వీరిద్దరి మధ్య సందీప్ సంచాలకుడిగా ఉంటారనీ, సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్తాడు బిగ్ బాస్. ఫస్ట్ ఛాలెంజ్ లో ఫుల్ రాజా ఫుల్ గేమ్
అందులో వరసగా మూడుసార్లు రణధీర టీం గెలిచి కీ ని సొంతం చేసుకుంటుంది 

ఇది ఈ రోజు ఎపిసోడ్ 2 వ  నామినేషన్స్ ప్రారంభం ఐయ్యాయి ఓట్ వేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి ,  

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top