BiggBoss 7 Telugu Day 15 Highlight ।

BiggBoss 7 Telugu Day 15 ఈరోజు ఎపిసోడ్ నిన్నటి మిగిలిన ఎపిసోడ్ తో మొదలైంది

Table of Contents

రైతు బిడ్డ ఎవుసం మరిచిపోయిండు:

 రైతుబిడ్డకు శివాజీ మొక్కలు పెంచే విధానంలో సలహా ఇస్తున్నాడు స్విమ్మింగ్ పూల్ వాటర్ లో క్లోరైడ్ ఉంటుంది అవి పోయవద్దు,హౌజ్ లో నుండి వాటర్ తీసి పోయి అని సలహా ఇచ్చాడు.

మహేష్ బాబు దూకుడు సాంగ్ ద్వారా BiggBoss 7 Telugu Day 15 మొదలైంది. సుబ్బుతో ప్రియాంక. ప్రిన్స్ గూర్చి నేను వాడికి నామినేషన్ లో అర్థం అయ్యేలా చెప్తా అని మాట్లాడుతుంది శివాజీకి రెండవ పవర్ అస్త్ర వచ్చినందుకు అందరూ అభినందనలు తెలియజేశారు.

నీవు కూడా దామిని ని నామినేట్ చెయ్:

శుభ శ్రీ కి యావర్ నేను నామినేషన్ కు వస్తానని నాకు తెలుస్తుంది నేనంటే హౌస్ లో అందరికీ భయం నా ఆట నేను ఆడటానికి వచ్చాను అయిన నాకు ఏం పర్వాలేదు అని చెప్తూనే నీవు కూడా దామిని నీ నామినేట్ చెయ్ గుస గుస చెప్పగానే శుభశ్రీ నాకు నామినేట్ చేయాలని ఉంది తను ఏం గేమ్ ఆడింది అని మాట్లాడింది.

పవర్ అస్త్ర సేఫ్ :

బిగ్ బాస్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ మొదలవబోతోంది ఇందులో పవర్ అస్త్రా సాధించిన సందీప్, శివాజీ మినహాయించి మిగతా సభ్యులు ఈ నామినేషన్ లో ఉండవలసి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియజేశాడు. BiggBoss 7 Telugu Day 15 బిగ్ బాస్ పిలిచినప్పుడు ఇంటి సభ్యులు వచ్చి చూపించబడిన టార్గెట్ లో తను నామినేట్ చేయాల్సిన సభ్యుని ఉంచి మొహం పై ఫోమ్ స్ప్రే చేయవలసి ఉంటుంది అలాగె ప్రతి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది మరియు ఎందుకు నామినేట్ చేస్తున్నారో సరియైన కారణాలు తెలియజేయాలి అని బిగ్ బాస్ తెలియజేశాడు .

  ( ఇ ది    చ ద వం డి :   శో భ శె ట్టి   బ యో గ్ర ఫీ )

నీ అట్టిటుడ్ బాలేదు :

ప్రియాంక తన మొదటి నామినేషన్ యావర్ ని చేసింది దానికి గల కారణాలను తెలియజేస్తూ బిగ్ బాస్ మనకు అలాట్ చేసిన రూములలో మాత్రమే ఉండాలని కానీ మీరు మీకు నచ్చనప్పుడు మీరు చెప్పే విధానం సరిగా లేదు మీ ఆటిట్యూడ్ కూడా నచ్చలేదు అని చెప్పగానే నా ఆటిట్యూడ్ కి ఏమైంది బాగానే ఉంది కదా అని కొంతసేపు వాదన పెట్టుకున్నాడు యావర్. BiggBoss 7 Telugu Day 15 రెండవ నామినేషన్ గౌతమ్ ని చేస్తూ నీవు ఇంటి పనులు అందరితో పోలిస్తే చాలా తక్కువ చేస్తున్నావు అలాగే నీవు ప్రిన్స్ తో చేసిన గొడవ అది అనవసరం అయిన విషయం అని నామినేట్ చేసింది.

నా పిల్లను ను టార్గెట్ చేసినవు :

ప్రశాంత్ తేజను నామినేట్ చేస్తూ నేను తొడ కొడితే నీకు నచ్చలేదు అన్నావు అది నా ఇష్టం అన్న నువ్వు ఎలా చెప్తావ్ అనగానే బిగ్ బాస్ ప్రశాంత్ మీరు సరియైన కారణాలు తెలియజేయండి అని చెప్పగానే గత వారం బెడ్ రూమ్ లో ఎవరు కింద పడుకుంటే ఏంటి ఎవరు పైన పడుకుంటే ఏంటి అని రతిక ను ఉద్దేశించి ఒక అమ్మాయిని టార్గెట్ చేసి నువ్వు అలా అనడం తప్పు అనగానే రతిక అది సాల్వ్ అయింది మేము మాట్లాడుకున్నాం కానీ ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలుపు అనగా నాకు తప్పు అనిపించింది అని ప్రశాంత్ చెప్పాడు అందరూ సభ్యులు సిల్లీగా చెప్పకు ఏదైనా బలమైన కారణాలు ఉంటే చెప్పు అని సలహాలు ఇచ్చారు.

F*** నా ఊత పదం :

ప్రశాంత్ రెండవ నామినేషన్ దామిని ని చేస్తూ అందరూ వాళ్ళ ఇంటిదగ్గర పాత్రలు కడుగుతారో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ప్రతిసారి అందరితో కోప్పడతావు అలాగే నువ్వు F*** పదం వాడడం నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్న అనగానే బదులుగా నేను కూడా ఇక నుండి వంట చేయను , కిచెన్ లో ఏ వస్తువు ఎక్కడ ఉన్నా నాకు సంబంధం లేదు.BiggBoss 7 Telugu Day 15  నీలాగే ఉంటా అలాగే F** అనే పదం నా ఊత పదం దానికి నేనేం చేయలేను అని ముగించింది.

అందరితో బాగుండి సేఫ్ గేమ్ ఆడుతున్నావు:

శోభ శెట్టి శుభ శ్రీ నీ నామినేట్ చేస్తూ హౌజ్ ఏం పని చేస్తున్నావ్ కేవలం కిచెన్ లో మాత్రమే ఉంటావు వేరే పని చేయట్లేదు అందరితో చాలా బాగుంటావు ఇప్పటివరకు నామినేషన్ కి రాలేవు ఎందుకో నీవు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనుకుంటా అని ఈసారి నామినేట్ చేస్తున్నా అని కారణం చెప్పింది సుబ్బు అందరితో బాగున్న, నన్ను నామినేట్ చేయడం వారి ఇష్టం నేనేం చేయలేను అని సమాధానం ఇచ్చింది. BiggBoss 7 Telugu Day 15 ఇందులో బిగ్ బాస్ మాట్లాడుతూ శివాజీ సుబ్బు , శెట్టి లలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని అడగగానే శివాజీ నాకు పెట్టావుగా ఫిట్టింగ్ అంటూ సుబ్బు కరెక్ట్ బిగ్ బాస్ ఇది గేమ్ ఎవరి గేమ్ వారి ఇష్టమున్నట్టు ఆడతారు అని సమాధానం ఇచ్చాడు.

( ఇ ది    చ ద వం డి :   ర  తి  క   బ యో గ్ర ఫీ ) 

నీ వల్ల నా గేమ్ పోయింది:

రెండవ నామినేషన్ శెట్టి రతిక ని చేస్తూ చివరగా వెళ్తా అని నువ్వు ఒక గంట కంటే ఎక్కువసేపు మా అందరినీ నీ మొండితనంతో నిల్చోబెట్టావ్ నీ గురించి స్వార్థంతో మాత్రమే ఆలోచించి ఇలా చేసావు అనుకుంటా నువ్వు ఆలస్యం చేసినందుకే మాకు రావాల్సిన గేమ్ వేరే వాళ్లకు వెళ్లిపోయింది అని నామినేట్ చేసింది.BiggBoss 7 Telugu Day 15

అమర్ గౌతమ్ నీ నామినేట్ చేస్తూ నీవు హౌస్ లో పనిచేసినది చాలా తక్కువ మిగతా ఇంటి సభ్యులతో పోల్చితే, నామినేషన్ లో లేని వారికి ప్రయోజనం ఇచ్చి నామినేషన్ లో ఉన్నవారికి ఇవ్వను అని అనడం నాకు సరిగా అనిపించలేదు అందుకే నామినేట్ చేస్తున్నా.

నాకు మోషన్స్ అయిన కూడా :

రెండవ నామినేషన్ శుభశ్రీ నీ చేస్తూ నీవు ఎప్పుడు కిచెన్ దగ్గరనే ఉంటావు బయటకు రావు కేవలం అక్కడ ఉన్న టేబుల్ ని కూడా క్లీన్ చేయవు అని నామినేట్ చేశాడు. BiggBoss 7 Telugu Day 15ఆ తర్వాత సుబ్బు ప్రిన్స్ తో మాట్లాడుతూ ఒక మనిషి 12 రోటీలు చేస్తే ఎలా ఉంటుందో వారికి తెలియదు నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా , లూజ్ మోషన్స్ అయినా చేస్తున్న అసలు దామిని ఏం చేస్తున్నారు అనగానే రతిక నీ రోటీలు నువ్వు చేసుకో మిగతా వాళ్ళ సంగతి నీకెందుకు వాళ్ళు రోటి లే తింటారో, అన్నము తింటారో వాళ్ళ ఇష్టం కదా .

BiggBoss 7 Telugu Day 15 కిచెన్ దాటి రా తల్లీ :

రతిక శుభశ్రీ ని నామినేట్ చేస్తూ పని అంటే కిచెన్ లో మాత్రమే కాదు మిగతా పనులు కూడా చేయాలి నువ్వు బయటకు వస్తే ప్రేక్షకులకు కూడా నీవు తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. BiggBoss 7 Telugu Day 15 Highlight  నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని నాకు అనిపిస్తుంది అలాగే నువ్వు అన్ని గేమ్ లలో ఫెయిలయ్యావు అని నామినేట్ చేసింది.

నేను చెప్తా కానీ నాకు ఎవరూ చెప్పొద్దు :

రెండవ నామినేషన్ గౌతమ్ నీ చేస్తూ నీ పనులు నువ్వు మాత్రమే చేసుకోవాలి మిగతా వారికి చెప్పకూడదు ఆ వాటర్ తీసుకురా ఇంకా, ఇంకా వేరే పనులు చెబుతూ ఉంటావు అనగానే గౌతమ్ నీకు కూడా నేను చాలాసార్లు ఆమ్లెట్, వాటర్ తీసుకొచ్చాను కదా అప్పుడు తెలియలేదా ఈ కారణం అలాంటప్పుడు ఇంకొకరికి చెప్పొద్దు నీవు అని చెప్తూనే నువ్వు ఈ రోజు నామినేషన్ కి వెళ్లేటప్పుడు డాక్టర్ బాబు నా దగ్గర ఉండు అన్నావు కదా అప్పుడు గుర్తుకు రాలేదా ఏం పని చెప్పకూడదు ఇంకొకరికి అని నువ్వు మాత్రమే చెప్తావా ? అంటే నువ్వు చెప్తే అందరు వినాలి కానీ నువ్వు ఎవరు చెప్పినా వినవు అని ఫైర్ అయ్యాడు.

అది నా గేమ్ ,నా పేపర్. నా ఆన్సర్ నీకేంటి నొప్పి:

తేజ ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ నా వ్యక్తిగత అభిప్రాయంతో చెబుతున్నాను నీకు బిగ్ బాస్ ప్రక్రియ సరిగా అర్థం కావడం లేదు అనగానే ప్రశాంత్ నాకు అర్థం కాలేదు అని నువ్వు ఎలా చెప్తావ్ అన్న అది నీ ప్రాబ్లం నా తప్పు కాదు కదా. నామినేషన్ అనేది పెద్ద విషయం సిల్లీగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ అమ్మాయితో నా గొడవ ఎప్పుడూ అయిపోయింది అని తేజ బదులు చెప్పగానే ప్రశాంత్ మాట్లాడుతూ నువ్వు నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నావు నీకు పాజిటివ్ , నెగిటివ్ గాలి తెలుస్తది కదా అన్న ప్రతిసారి ఆ గాలి నా పనే ఎందుకు వస్తుంది నా గేమ్ నేను ఆడుతున్న నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ . BiggBoss 7 Telugu Day 15 నాది తప్పులేదు నా క్వశ్చన్ పేపర్లో నా ఆన్సర్ ఉండాలి అంటూ తేజను ఒక రకంగా ఆడుకున్నాడు తేజ తో ప్రశాంత్ తోడను కూడా కొట్టించుకున్నాడు తేజ అనేటివి చేస్తూ తనలాగే ఆక్ట్ చేస్తూ కొంతసేపు సతాయించి నువ్వు చెప్పేది తప్పు అన్న తర్వాత బరాబర్ చూసుకుంటా అని ప్రశాంత్ అన్నాడు.


నీ తెలివి నా కొంప ముంచినది:

BiggBoss 7 Telugu Day 15 Highlight  రెండవ నామినేషన్ గౌతమ్ నీ చేస్తూ పుల్ రాజా పుల్ లో నువ్వు చెప్పిన సలహా వలన నేను ఇంటి సభ్యుల మధ్యలో, నాగర్జున గారి దగ్గర పెంట పెంట అయ్యాను నువ్వు తెలివిగల వాడివి అని నువ్వు చెప్పినట్టు నేను చేశాను అనగానే గౌతమ్ నువ్వు పొగుడుతున్నావా?, తిడుతున్నావా? మళ్లీ నామినేషన్ చేస్తున్నావ్ నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు.

మీరు ఫుడ్ వేస్ట్ చేస్తారు నేను నా కడుపులో వేస్తాను అంతే :

BiggBoss 7 Telugu Day 15 యావర్ ప్రియాంక ని నామినేట్ చేస్తూ నీ ఆటిట్యూడ్ నాకు నచ్చలేదు అని కారణం చెప్పగానే ప్రియాంక నాకు ఎవరితోనైనా లేదా ఏదైనా అవసరం ఉంటే రిక్వెస్ట్ చేస్తా కానీ నీలా రూడ్ గా మాట్లాడను అని కొంతసేపు వాదన పెట్టుకున్నారు నేను తినేటప్పుడు కొంచెం కొంచెం అంటావు నీవు మీరందరూ ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నారు కదా నేను నా కడుపులో వేస్తున్నాను ఇది కరెక్ట్ కాదా అని నామినేట్ చేశాడు.

షకీలా ను నామినేట్ చేశావు నువ్వు:

రెండవ నామినేషన్ దామిని చేస్తూ షకీలా అమ్మగారు వెళ్లిపోయినప్పుడు నేను మీ దగ్గరికి రెండు ,మూడు సార్లు మాట్లాడడానికి వచ్చాను కానీ మీరు నన్ను పట్టించుకోవడం లేదు నాకు బాధ అనిపించింది నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారా అనిపించింది అనగానే దాని మీ నామినేషన్ వలన షకీలా గారు ఇంటి నుండి వెళ్లిపోయారు ఆ సమయంలో మీరు వచ్చి నాకు హగ్ ఇచ్చి మాట్లాడుతా అంటే నాకు నచ్చలేదు అలాగే నేను చేయని వాటికి సారి చెప్పాను కొన్నిసార్లు చేసినా అసలు చెప్పను అని సమాధానం ఇచ్చింది.

నేను ఏమైనా వంటలక్కా నా ??డ్రామా లు చాలు యావార్:

దామిని నామినేట్ చేయటానికి వచ్చి నేను వంట చేస్తున్న కాని ఎవరు ఇంకో పని చేద్దాం అని మాత్రం రావట్లేదు నాకు వంటలక్కా అని బిరుదు కూడా ఇచ్చారు అని మొదటి నామినేషన్ యావర్ నీ చేస్తూ నీకు తెలుగు రావడం లేదు, అలాగే అర్థం కావడం లేదు ఎవరు చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు మీ ఎబిలిటీ చాలా తక్కువ ఉన్నది అని నా అభిప్రాయం ఇక్కడ నేను హోటల్ పెట్టుకోడానికి రావడం లేదు నా వల్లే రణధీర టీం గెలిచింది అని ఓవర్ కాన్ఫిడెంట్ నాకు నచ్చలేదు నీ నుండి మాయాస్త్రాన్ని ఇంకొకరుకి ఇస్తే నువ్వు తట్టుకోలేకపోయావు అలాగే గౌతమ్ తో గొడవలో మీరు చేసిన డ్రామా అనగానే డ్రామా అనవద్దు , నాగ్ సార్ కూడా చెప్పారు కదా అంటూ వాదన పెట్టుకున్నాడు మళ్ళీ కొత్తరకంగా ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్, బిగ్ బాస్ అని అరుస్తూ ఉన్నాడు మధ్యలో ఏదో చండాలం చూపిస్తుండగా శివాజీ డైవర్ట్ చేయాలని ట్రై చేశాడు రతిక నేను డ్రామా చేస్తున్నాన అని యావర్ అనగానే రతిక మధ్య లో రావటానికి ట్రై చేసిన మిగతా సభ్యులు ఆపేశారు. BiggBoss 7 Telugu Day 15 దానికి దామిని బదులుగా డ్రామా అంటే మీరు అనుకున్న విధంగా యాక్టింగ్ కాదు ఒక అనవసరైన విషయాన్ని మీరు చాలా అతిగా చేశారు అని ముగించింది.

అందరూ నన్నే అంటారు :

BiggBoss 7 Telugu Day 15 రెండవ నామినేషన్ శుభశ్రీని చేస్తూ అందరితో పోల్చుకుంటే నీవు హౌస్ లో చాలా తక్కువ పని చేస్తున్నావు అని నామినేట్ చేసింది శుభ శ్రీ కి కోపం వచ్చి అందరూ నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు కారణం లేకుండా పనిని చేయట్లేదు అని ఒకటే కారణం చెప్తున్నారు. నీవు కట్టప్పలో కూడా నన్ను టార్గెట్ చేశావు నన్ను నిల్చోపెట్టి అన్ని అబద్ధాలు చెప్తున్నావు అనగానే దామిని 24 గంటలు రెడీ అవ్వడానికి కేటాయించిన సమయం లో మిగతావి పట్టించుకోవడం లేదు అని ఆపేసింది.


నేను తప్పు చేయను :

BiggBoss 7 Telugu Day 15 గౌతమ్ మొదటి నామినేషన్ రతిక ను చేస్తూ తప్పు,ఒప్పు అనే రెండు విషయాలు ఒకే దగ్గర ఉండవు .అందరూ టీం సభ్యులు ఒక నిర్ణయంతో ఉంటే నీవు మాత్రం స్వార్థంగా ఒంటరిగా ఉంటావు అనగానే రతిక నన్ను కూడా మీ ఐదుగురితో కలుపుకోవచ్చు కదా మీరు రాత్రి చెప్పిన విషయం నాకు నచ్చలేదు అలాగే కెప్టెన్ గా నీవు సరిగా నాకు చెప్పలేదు మీ అయిదుగురు ఆలోచన తప్పు అయినప్పుడు నేను మీతో ఎందుకు కలవాలి నాకు తప్పు అనిపిస్తే నేను ఆ తప్పు చేయను అని సమాధానం ఇచ్చింది.

ఫీల్ అవకు బాస్ :

రెండవ నామినేషన్ అమర్ నీ చేస్తూ మనం గేమ్ ఆడేటప్పుడు ,అలాగే కెప్టెన్ గా కొన్ని స్ట్రాటజీలు చేయాల్సి వస్తుంది .నాకు రాలేదు, నాకు ఇవ్వలేదని నువ్వు ఫీల్ అవుతున్నావ్ ఇది టీం స్పిరిట్ కాదు అందరిలో ఒకరికే మనం ఇస్తాం అని నామినేట్ చేశారు దానికి బదులుగా అమర్ రతిక చేసిన ఆలస్యం వలన బిగ్ బాస్ తన నిర్ణయం ద్వారా వచ్చిన అవకాశం పోయిందని కోపంతో అలా అన్నాను మరియు నీవు కెప్టెన్ గా సరిగా మి టీమ్ సభ్యులకు సరిగా వివరణ చేయనందుకే ఆలస్యమైంది అని చెప్పాడు.

లేజీ బాబు నోటి దూల :

BiggBoss 7 Telugu Day 15 శుభశ్రీ తేజను నామినేట్ చేస్తూ మీ దగ్గర టీం స్పిరిట్ లేదు ,మీరు గేమ్ ఆడేటప్పుడు యాక్టివ్ గా ఉండటం లేదు లేజీగా ఉంటారు ఏదైనా డిస్కస్ చేద్దాం ముందుకు రా అంటే మీరు రారు మి ఎఫర్ట్ నేను ఎప్పుడూ చూడలేదు అనగానే తేజ మనకు గేమ్ తెలియకుండా స్ట్రాటజీ ఎలా చేయాలి అని ప్రశాంత్ గా చేస్తూ సరదాగా నవ్వుతూ పవర్ అస్త్ర గురించి నా నోటి దూలతో అందరికీ తెలిసింది సారీ అని ముగించాడు .

బిగ్ బాస్ నన్ను పడేసింది:

ప్రియాంక నీ నామినేట్ చేస్తూ మీ వలనే మనం ఓడిపోయాం మీకు కిచెన్ లో ఏమైనా పని ఉందా చేయాలా అని అడిగితే మీరు వద్దు ,వద్దు అంటారు. BiggBoss 7 Telugu Day 15 మళ్ళీ ఏం పని చేయలేదని అందరితో చెప్తూ ఉంటారు అనగానే ప్రియాంక మాట్లాడుతూ నీకు ఎవరు చెప్పినా వినవు, అంగీకరించావు ప్రతిసారి కెమెరా ముందుకు వెల్లి వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్పటం కరెక్ట్ కాదు గేమ్ లో దెబ్బలు తగలడం సహజం అని చెప్పింది.

పవర్ అస్త్ర ఉల్టా పుల్ట నామినేషన్ సభ్యులు :

బిగ్ బాస్ మాట్లాడుతూ ఈవారం నామినేషన్ లు శుభశ్రీ , గౌతమ్, ప్రియాంక, తేజ ,దామిని ,రతిక యావరు అని తెలియజేస్తూ పవర్ అస్త్రాలు సాధించిన సందీప్, శివాజీకి ప్రత్యేకమైన పవర్స్ ఇచ్చి నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేస్తూ,సేఫ్ గా ఉన్న ఒక సభ్యుని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొని సందిప్ అమర్ ని నామినేట్ చేస్తున్న బిగ్ బాస్ అనగానే కారణం చెప్పమన్నాడు దానికి సందీప్ మీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ దాన్ని మీరు వినియోగించుకోలేరు అలాగే నీవు సేఫ్ అయి రాగలవని నామినేట్ చేస్తున్న అని చెప్పాడు.కేవలం బిగ్ బాస్ ఎవరిని సేవ్ చేస్తున్నారు ఎవరి ని నామినేట్ చేస్తున్నారు మాత్రమే చెప్పాలి అనగానే నామినేట్ అమర్ ని చేస్తున్నాము ,సేవ్ తేజ ని చేస్తున్నామ్ అనగానే

బిగ్ బాస్ నామినేటెడ్ సభ్యులైన అమర్ ,గౌతమ్ ,శుభశ్రీ , రతిక ,ప్రియాంక ,దామిని, యవర్ నామినేషన్ లో ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు ఎపిసోడ్ ముగించాడు .

Your Page Title

show your love

Subscribe
Notify of
guest
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
ggwinvip
ggwinvip
23 days ago

Alright guys, ggwinvip is okay. It is smooth and you can play for sometime. I find it really interesting and nice. ggwinvip

oleh khavylo
oleh khavylo
1 month ago

Somebody essentially lend a hand to make significantly posts I might state That is the very first time I frequented your web page and up to now I surprised with the research you made to create this particular put up amazing Excellent job

Discover more from BIGG BOSS 9 TELUGU VOTING

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top
2
0
Would love your thoughts, please comment.x
()
x