BIGG BOSS 7 TELUGU DAY 3 HIGHLIGHTS|రొమాంటిక్ ‘ఛీ’… గౌతం, శుభశ్రీ కి చెవిలో ఏం చెప్పాడు.

Bigg Boss 7 Telugu Day 3 | Bigg Boss 7 Telugu Day 3 highlight |  Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks

టాస్క్ గెలవాల్సిందే

నిన్న బిగ్ బాస్ ఓటింగ్ తర్వాత కంటెస్టెంట్స్ మధ్య పెరిగిన దూరాలతో ఈరోజు BIGG BOSS 7 TELUGU DAY 3 ఎపిసోడ్ లో ఎలా సాగబోతుందో అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ పుష్ప సినిమాలోని ఏ బిడ్డ సాంగ్ తో ప్రారంభించారు. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరితో ఈ సీజన్ అన్ని సీజన్లలా కాదని ఉల్టా పల్టా అనే కొత్త కాన్సెప్ట్ వినూత్నంగా సాగుతుందని ఇంటి సభ్యులందరికీ తెలుసు కదా అంటాడు.  మీరు ఇప్పటికీ ఇంటి సభ్యులుగా కన్ఫామ్ కాలేదు కంటెస్టెంట్స్ గానే కొనసాగుతున్నారు మీరు ఇంటి సభ్యులుగా మారాలంటే మేము ఇవ్వబోయే టాస్కుల్లో గెలవాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క సభ్యుడే గెలుస్తాడు అతనికి ఐదు వారాలు ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఈ ఐదు వారాలు ఇమ్యూనిటీతో వారిని ఆ ఐదు వారాలు ఎవరు నామినేట్ చేయడానికి వీలు ఉండదు.
బిగ్ బాస్  పిలిచాడని ఎవరో గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేయకుండా వచ్చేసారు, దాన్ని బిగ్ బాస్ చూసి దాన్ని ఆన్ చేసిన వారికి ఆఫ్ చేసే జ్ఞానం కూడా లేకుండా ఎలా వస్తారని తిడతాడు.

ముద్దుతో లిప్స్టిక్ :

టేస్టీ తేజానీ చిన్నపిల్లాడిలా తయారుచేసి లిప్స్టిక్ పుస్తూ తలకి జుట్టు వేస్తూ ఆటపట్టిస్తారు శుభశ్రీ, రతిక . లిప్స్టిక్ పోయకుండా, ముద్దిచ్చి డైరెక్ట్ లిప్స్టిక్   అంటించమంటాడు తేజ . తను ఇయ్యకుండా దూరం పారిపోతే షకీలా వచ్చి ముద్దు ఇస్తుంది.

పక్క లవ్ ట్రాకేనా ?

ప్రశాంత్ సోఫా పైన లవ్ సింబల్ వేసినట్టు యాక్ట్ చేసి దాన్ని కెమెరా వైపుకి విసిరేస్తాడు. అదే లవ్ సింబల్ తో Bigg boss 7 telugu Love tracks నడపాలంటే ఇంట్లో ఉన్న ఎవరికి ఇస్తావని రతిక అడిగితే ఇంట్లో వారికి ఇవ్వను ఆల్రెడీ కెమెరా నుంచి బయటకు పంపించేశానంటాడు పల్లవి ప్రశాంత్. మళ్లీ అడుగుతుంది రాతిక ఇంట్లో ఉన్న ఎవరికి ఇస్తావ్ ఆ హాట్ సింబల్ అని, నువ్వు ఫస్ట్ చెప్పు ఆ తర్వాత నేను చెప్తా అంటాడు ప్రశాంత్, నీకే ఇస్తానంటుంది రాధిక దాంతో పల్లవి ప్రశాంత్  పిచ్చిపిచ్చిగా చేస్తూ సోఫాలో ఉన్న ప్రిన్స్ పైన పడతాడు. మళ్లీ  అడుగుతుంది రతికా, ఎవరికి ఇస్తావ్ ఆ హాట్ సింబల్ అని, చెప్పడానికి మొహమాట పడతాడు ప్రశాంత్ . కప్ పెట్టేసి వస్తానని అంతలోపు ఆలోచించుకొని చెప్పమని అక్కడి నుండి వెళ్తుపోతుంది రతిక. Bigg Boss 7 Telugu Day 3 లో ఇష్టమైతే చెప్పేయ్యు మామ అంటాడు ప్రిన్స్.

నామినేషన్ వరికి మనం పోవద్దు

ప్రిన్స్ సోఫా పైన కాళ్లు పెట్టుకొని పడుకోవడంతో అక్కడి నుంచి కాలు తీసేయమంటుంది ప్రియాంక. తర్వాత ఆ విషయం పైన ఎక్కడ నామినేషన్ వేస్తాడో అని మళ్ళీ వచ్చి తప్పుగా అనుకోవద్దు, క్లారిటీ ఇస్తున్నాను మనం రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఇది. అందుకే ఇక్కడ షూస్ తో కాల్ పెట్టుకోవడం సరిగ్గా ఉండదు కుటుంబ సభ్యుడిగా చెప్తున్నానని అంటుంది ప్రియాంకా. ఈ విషయంలో ఎక్కడ నామినేషన్స్ వేస్తాడో అని భయపడినట్టు క్లారిటీ కోసం వచ్చినట్టు అనిపిస్తుంది.

బిగ్ బాస్ 7 లో మొదటి టాస్క్ :

బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్
ఫేస్ ద బీస్ట్  . అంటే రింగ్ లో ఉండి కుస్తీ పోటీలో బాడీ బిల్డర్స్ తో ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేస్తూ రింగ్ లో ఎక్కువ సమయం ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి నెక్స్ట్ పోటీకి అర్హత సాధిస్తారు.

అంతా తూచ్ :

రింగ్లో యుద్ధానికి సన్నద్ధమవుతుంటారు ఇంటి సభ్యులు, ఇద్దరు బీస్ట్ లు ఇంట్లో కి వస్తారు. వారిని చూసి ఇంట్లో వారందరూ భయపడుతూ ఉంటారు పాట పాడడంలో చూపిన ఉత్సాహం ఆటలో చూపించాలని రతికని ముందు రింగులోకి రమ్మంటాడు బిగ్ బాస్. Bigg Boss 7 Telugu Day 3 లో
రింగ్ లోకి వెళ్లిన రతికని  కొన్ని సెకండ్లకే బయటకు తోసేస్తుంది లేడీ బీస్ట్. తర్వాత  అమర్దీప్ రింగులోకి ఎంట్రీ ఇస్తాడు. అమర్ది పోరాడుతూ ఉండగా ఆ బాడీ బిల్డర్ రింగ్ బయట కాలు పెడతాడు బజర్ మొగడంతో అమర్దీప్ గెలిచాడని ఇంటి సభ్యులందరూ గెంతులు వేస్తూ కేరింతలు కొడతారు. బిగ్ బాస్ సీజన్ 7 అంటే ఉల్టా పల్టా కదా ఇక్కడే బిగ్ బాస్ అసలైన ట్రస్ట్ ఇస్తాడు. ఇది కేవలం ట్రయల్ మాత్రమే అసలైన ఆట ముందుందని ఆ బాడీ బిల్డర్స్ ఇద్దరు ఇంటి నుండి బయటకు నడుస్తారు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ శాకై చూస్తూ ఉంటారు.

గౌతం ❤️ శుభ శ్రీ ల మధ్య ?

తర్వాత గ్యాప్ లో ఇంట్లో వాళ్ళందరూ విభత్సంగా ప్రాక్టీస్ చేస్తూ కనబడుతారు. అమర్, శుభశ్రీ తో కామెడీ చేస్తూ ఉండడంతో కలగజేసుకుంటాడు గౌతమ్ కృష్ణ. అక్కడే ఉన్న ప్రియాంకా ,శోభాశెట్టీలకి శుభ శ్రీ పైన గౌతమ్ కు లవ్ ఉన్నట్టు కనబడడంతో అడిగేస్తారు నువ్వేమైనా శుభ శ్రీ ని లవ్ చేస్తున్నావా అని అడుగుతారు ఆ మాటతో నవ్వుతాడు గౌతం ఎక్కడో Bigg boss 7 telugu Love tracks నడుపుతున్నట్లు, లవ్ చేస్తున్నట్లయితే ఈ క్లిప్ తో అనిపిస్తుంది.

అసలు పోటీ

అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది రింగులోకి పిలుస్తాడు బిగ్ బాస్ కామెడీ కామెడీ చేస్తూనే బాడీ బిల్డర్ ని బయటకు  తోసేసి గెలిచేసాను అనుకుని రింగు బయటకు వచ్చేస్తుంది కిరణ్ రాథోడ్. కానీ బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం బాడీ బిల్డర్ బయటకెళ్ళినా గెలిచినట్టు కాదు ఎక్కువ సమయం ఎవరైతే రింగ్లో ఉంటారో వారే నెక్స్ట్ లెవెల్ కి అర్హత సాధించినట్లు . Bigg Boss 7 Telugu Day 3 highlight తర్వాత పిన్స్ యవార్ ని రింగులోకి పిలుస్తాడు బిగ్ బాస్. ప్రిన్స్ యవర్, అమర్దీప్, శుభశ్రీ, దామిన, షకీలా,గౌతం , శోభా లను వరుసగా పిలిచి టాస్క్ ఆడించాడు. తర్వాత పల్లవి ప్రశాంత్ అల్లు అర్జున్ పుష్ప స్టైల్లో రింగ్ లోకి ఎంట్రీ ఇస్తాడు ఎంతసేపు ఉంటాడులే బక్క పలుచని బాడీ అనుకుంటారు, కానీ అప్పటివరకు పర్ఫామెన్స్ చేసినవారిలో ఇతనే అందరికంటే ఎక్కువసేపు రింగ్లో ఉంటాడు. ఆ బిల్డర్ కాలనీ గట్టిగా పట్టేసుకుని బిల్డర్ కి ఛాన్స్ ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తాడు. తర్వాత శివాజీ తొందరగానే బయటకు వచ్చేస్తాడు. ఆటకి మధ్యలో ఇచ్చిన గ్యాప్ లో పల్లవి ప్రశాంత్ ఆట గురించి మాట్లాడుతూ తను చాలా స్ట్రాంగ్ కంటేస్టెంట్ అంటాడు శివాజీ. రతిక కూడా త్వరగా రింగ్ నుండి బయటకి వచ్చేస్తుంది. తేజా రింగ్ లోకి వెళ్లకుండా చాలాసేపు కామెడీ చేస్తే రింగ్ బయటే ఉంటాడు బిగ్ బాస్ కూడా రింగ్ లోకి వెళ్ళే బెల్ మోగించడు అందరూ నవ్వుతూ ఉంటారు…  లేడీ బిల్డర్ ని రింగులోకి రమ్మంటాడు తేజ, టేబుల్ పైన కూర్చుని ఉన్న ఆమె  పైకి లేచి రింగ్ వైపు నడవడం ఇంటి సభ్యులందరూ కేరింతలు  కొడుతూ అరుస్తారు. ప్రియాంక, సందీప్ అందరికంటే ఎక్కువ సమయం రింగ్ లో పోరాడారు.

మనం బాగా ఆడాలి :

ప్రిన్స్, శుభశ్రీ తరువాత వచ్చే టాస్క్ ల్లో  బాగా ఆడాలని ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకో సైడ్ గేమ్ ఆడటానికి వచ్చాం గేమ్ ఆడాలి నీకు మొదట్లో ఉన్న నమ్మకం ఇప్పుడు లేకుండా పోతుంది, ఇప్పటి నుంచైనా ఎందుకు వచ్చావు తెలుసుకుని ఆలోచించి సరిగ్గా ఆడు అంటూ రతికకి మోటివేట్ చేస్తాడు పల్లవి ప్రశాంత్.

మొదటి టాస్క్ గెలుపు గుర్రాలు

Bigg Boss 7 Telugu Day 3 highlight ఎవరు ఎక్కువ సేపు రింగ్ లో ఉండగలిగారు వారి టైమింగ్స్ ని  టివి పైన ఇస్తాడు బిగ్ బాస్. బాయ్స్ లో సందీప్ – 1 min 49 sec, ప్రశాంత్ – 1 min 44 sec, తేజా – 1 min 49 sec, ప్రిన్స్ -32 sec, అమర్ దీప్ 18 sec, గౌతం 15 sec, శివాజీ 13 sec రింగులు ఉన్నారు.
ఇక అమ్మాయిలలో చూసుకుంటే ప్రియాంక 1 min 7 sec, శోభా 57 sec , దామిని – 42 sec, షఖీలా – 37 sec, కిరణ్ – 34 sec, శుభ శ్రీ – 26 sec, రతిక – 16 sec రింగులో ఉన్నారు.

కన్ఫర్మేషన్ కోసం పటి పడే మొదటి 2 స్థానాలకుగాను  “ఫేస్ టూ బీస్ట్” ఛాలెంజ్ లో ఎక్కువ సేపు రింగ్ లో ఉన్న ప్రియాంక , సందీప్ తరువాత జరిగే పోటీకి అర్హత సాధించారు.

Bigg boss 7 telugu day 3 ప్రశాంత్ కావాలనే :

1st స్థానంలో రానందుకు ఏడుస్తాడు పల్లవి ప్రశాంత్ , ఇంట్లో వాళ్ళు అందరు వచ్చి ఒదారుస్తు మోటివెట్ చేస్తారు. పడుకునే పల్లవి ప్రశాంత్ కింద పడుకోవడంతో అతను అలా పడుకుని మనమే కావాలని అతనికి బాక్ గ్రౌండ్ లేదని కావాలనే పడుకోబెట్టాం అని  ప్రేక్షకులు అనుకుంటారేమో అని అంటాడు అమర్ దీప్ ,అవును అంటారు షకీలా ,సందీప్. పల్లవి ప్రశాంత్ సింపతితో ఓట్లు వేయించోవలని అనుకుంటున్నట్టున్నాడు వీళ్ళు డిస్కషన్ చేస్తారు.

రొమాంటిక్ ‘ఛీ’

మైక్ తీసేసి మైక్ కి వినబడకుండ దూరం పెట్టేసి శుభ శ్రీకి చెవిలో  చెప్తాడు  గౌతం. ఏంటి సీక్రెట్ టాస్కా అంటుంది శుభ శ్రీ. మళ్లీ మైకు దూరంగా పట్టుకుని చేవి ఎదో చెప్తే “ఛీ” అంటుంది శుభ శ్రీ . చూడాలి వీళ్లది ప్రేమాయణమో, స్నేహమో. మైక్ దూరం పెట్టకుండా మాట్లాడినందుకు బిగ్ బాస్ ఎం అంటాడు, లేదా వీక్ ఎండ్ లో చెవిలో ఎం చెప్పావో ఇప్పుడు అందరికీ వినబడేలా చెప్పుమని నాగార్జునా అంటాడో చూడాలి .
ఇది ఈరోజు ఎపిసోడ్. మీ ఫేవరేట్ కంటేస్టెంట్ కి కింద లింక్ తో ఓట్ వేయండి.

Bigg boss 7 telugu day 2 highlights । మొదటి వారం నామినేషన్స్ తోనే గొడవలు షురూ .

Bigg Boss 7 telugu Day 1 Highlights । ప్రశాంత్ – రతిక ప్రేమాయణం ?? । నామినేషన్ ప్రక్రియ ప్రారంభం .

Bigg Boss 7 Telugu Day 3 | Bigg Boss 7 Telugu Day 3 highlight | Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks

Your Page Title

show your love

2 thoughts on “BIGG BOSS 7 TELUGU DAY 3 HIGHLIGHTS|రొమాంటిక్ ‘ఛీ’… గౌతం, శుభశ్రీ కి చెవిలో ఏం చెప్పాడు.”

  1. Pingback: Bigg Boss Telugu 7 Second Week Nominations । నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవ్వడి మాటా వినను-పీకుతున్నావ్ అనొద్దు . | BIGG BOSS 7 TELUGU VOTING

  2. Pingback: bigg boss vote Telugu । bigg boss 7 voting results । bigg boss voting | BIGG BOSS 7 TELUGU VOTING

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top