Bigg Boss 7 Telugu Day 5 | Bigg Boss 7 Telugu Day 5 highlight | Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks
గుడ్డు పగిలింది అయినా ఫెయిల్ అయ్యారు:
ఈరోజు బిగ్ బాస్ ఎగ్ తో స్టార్ట్ అయింది అదేనండి దామినికి కిరణ్ రాథోడ్ కి ఇచ్చే గుడ్డు టాస్క్ తో మొదలైంది . బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన 20 గుడ్లలో చేరి 5 గుడ్లను తీసుకొని ఇంటి సభ్యుల పైన పగలగొట్టి రెండు ఆమ్లెట్ వేసి బిగ్ బాస్ కు పంపించాలి అని ఒక చిన్న టాస్క్ ఇస్తాడు దానిని చాలా సంతోషంగా స్వీకరిస్తారు దామిని అండ్ కిరణ్ రాథోడ్ . దామిని మొదటి గుడ్డుని గౌతమ్ తలపైన పగలగొడుతుంది ఆ తర్వాత శుభశ్రీ ఆ తర్వాత షకీలా పైన పగలగొడుతుంది. చివరగా సందీప్ పైన పగలగొడుతుంది . కిరణ్ రాథోడ్ మొదటి షకీలా పైన ఆ తర్వాత సందీప్ ఆ తర్వాత గౌతమ్ పైన గుడ్డుని పగలగొడుతుంది. దామిని అండ్ కిరణ్ రాథోడ్ వారికి ఇచ్చిన టాస్క్ ని ఎవరికి చెప్పకూడదు కానీ వీరు ప్రతి ఒక్క కంటెస్టెంట్కు చెప్పి గుడ్డు పగలగొడుతున్నారు బిగ్ బాస్ కి కోపం వచ్చి మీ గుడ్డు టాస్క్ కంప్లీట్ అయింది మీరు దీంట్లో ఫెయిల్ అయ్యారు అని చెప్తాడు.
స్విమ్మింగ్ పూల్ లో దూకిన ప్రశాంత్ ,శుభశ్రీ:
శుభశ్రీ నీ, ప్రశాంత్ ని బిగ్ బాస్ 10 నిమిషాల్లో రెడీ అయి గార్డెన్లోకి రమ్మని పిలుస్తాడు కానీ ప్రశాంత్ బాత్రూంలో ఉండిపోయి నేను రాను అని ,వస్తే గుడ్డు కొడతారు అని భయపడి బాత్రూం లోనే దాక్కుంటాడు. చివరగా బిగ్ బాస్ 5 సెకండ్లు లలో రమ్మని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరు గార్డెన్ దగ్గరికి రాగానే పూల్ లో దూకేయమంటాడు.
నేను ఎవరిని నమ్మను ప్రశాంత్ ను తప్ప – రితిక:
ఆ తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ గార్డెన్ లోకి రమ్మని ఆహ్వానిస్తాడు కానీ శివాజీ, రతిక వాళ్లు గార్డెన్లోకి రాకుండా బాత్రూం లోనే దాక్కుంటారు ఎవరూ చెప్పిన రతిక నేను రాను రాను అని అంటుంది. కానీ ప్రశాంత్ పిలిస్తే బయటకు వస్తానని చెప్తుంది ప్రశాంత్ వచ్చి పిలవగానే బయటకు వస్తుంది రాగానే అందరికీ తెలుస్తుంది ఇది శివాజీకి ,రతిక కు ఇచ్చిన టాస్క్ అని , ఫైనల్ గా బిగ్ బాస్ అంటాడు మీరిద్దరూ మీకు ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేశారు కావున మీరు పవర్ అస్త్రాకి అర్హులుగా గుర్తించాము అని. పాపం ఈ విషయంలో ప్రశాంత్ ఫీలవుతాడు మేము కూడా టాస్కులు చేసాము కదా అన్న అని శివాజీ తో అంటాడు
గ్లాసులు కడగడానికి రాలేదు -ప్రియాంక :
ప్రియాంక కి కోపం వచ్చింది ఎవరూ బిగ్ బాస్ కి ఊరికే గ్లాసులు కడగడానికి రాలేదు ఏదో సాధించడానికి వచ్చారు ఎవరి గ్లాసులు వాళ్ళు కడగాలి అని కానీ ఈ విషయంలో దామినికి ఎందుకో కోపం వచ్చింది ఇప్పుడు గ్యాంగ్ గ్యాంగులుగా కోడి డిస్కషన్ మొదలుపెట్టారు. Bigg Boss 7 Telugu Day 5 షకీలకి కోపం వచ్చింది బిగ్ బాస్ కి రతిక అంటే ఎందుకు అంత ఇష్టం ఆమె ఎప్పుడూ ఏం పని చేయదు కదా అని.
సాంగ్ డిసైడ్ చేస్తది ఈ రోజు ఏంటో :
బిగ్ బాస్ లో ఉదయం ధూంధాం దోస్తానా అంటూ నేచురల్ స్టార్ నాని దసరా సినిమాలోని సాంగ్ తో మొదలైంది , మామూలుగా బిగ్ బాస్ లో ఉదయం ఏదైనా సాంగ్ ప్లే అవుతుంది అంటే ఆ సాంగ్ ఆ రోజుని ఆ సాంగ్ నిర్ణయిస్తుంది. ఈరోజు టాస్కులు ఏ విధంగా ఉంటాయి సభ్యుల మధ్యల సఖ్యత ఏ విధంగా ఉంటుందని అన్నట్టుగానే బిగ్ బాస్ గ్రూపుల మధ్య చిచ్చు పెట్టాడు అంటే గ్రూపులుగా విడగొట్టాడు
ఈ మధ్యలో ప్రశంత్,శెట్టి ల మధ్య అన్నా చెల్లెల అనుబంధం చాలా దృఢంగా మారిపోయింది పాట ఒకటే తక్కువైంది.
అది నా పిల్ల , నీకు తెలీదా -ప్రశాంత్ :
గౌతమ్ కావాలని రతిక దగ్గరికి వెళ్లి ప్రశాంత్ ని ఏడిపిస్తాడు దీన్ని ఆసరాగా తీసుకొని మిగతా సభ్యులు కూడా ప్రశాంత్ ని రెచ్చగొడుతున్నారు కొంత సమయం తర్వాత రతిక, ప్రశాంత్ దగ్గరికి వచ్చి నీకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఫ్రెండ్స్ వద్ద నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పు చెప్తేనే నాకు తెలుస్తుంది అని అంటే ప్రశాంత్ నీకు తెలియదా నా మనసులో ఏముందో నీకు తెలియదా రతికను అంటాడు. Bigg Boss 7 Telugu Day 5 highlight రతిక ప్రశాంతిని ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకు ఏం తెలియదు నువ్వు చెప్తే తెలుస్తుంది చెప్పు చెప్పు అంటుంది.
నేను నీకు ఓకేనా శుభ శ్రీ తో గౌతం :
శుభశ్రీ తేజ తో డాన్స్ చేస్తున్నప్పుడు గౌతం కి నచ్చలేదు అపుడు ప్రియాంక ,శుభ శ్రీ నీ అడుగుతుంది గౌతమ్ తో డాన్స్ చేయొచ్చు కదా అని శుభ శ్రీ నేను చెయ్యను అంటుంది, అప్పుడు గౌతమ్ కి కోపం వచ్చి నేను నీకు ఓకేనా అంటాడు. శుభశ్రీ ప్రశాంత్ తో డిస్కస్ చేస్తుంది. అప్పుడు మధ్యలో మళ్ళీ గౌతమ్ వచ్చి ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు అంటాడు.నేను నీతో దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాల్నా నేను నీకు ఓకేనా కంఫర్ట్ గానే ఉన్నావా అని అడుగుతాడు నీ ఇష్టం నువ్వు ఎలా కావాలంటే అలాగా ఉండు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటుంది శుభ శ్రీ. కొంత సమయం తర్వాత గౌతమ్ ప్రియాంక శోభ శెట్టి దగ్గరికి వచ్చి సింగల్ గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అందరూ ఉన్నప్పుడే దూరం పెడుతుంది అని అంటాడు.
Bigg Boss 7 telugu Day 5 శివాజీ సలహా షకీలా నాటకం :
షకీలా కావాలని తనకి బాగోలేదని శివాజీ కిరణ్ తో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ వచ్చి ఇన్ హెల్ exhale చేయమని షకీలాని అడుగుతాడు అప్పుడు షకీలా చేస్తూ శ్వాస ఇబ్బంది అయినట్లు యాక్టింగ్ చేస్తుంది
శివాజీ కెమెరా ముందుకొచ్చి ఇది ఫ్రాంక్ అని చెప్తాడు కానీ తేజ కి తెలియక షకీలా కి సేవ చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో షకీలా లేచి కలవరిస్తుంది షకీలా ఎవరికీ నిద్ర లేకుండా చేసింది కాని మధ్యలో షకీలా దామిని కి చెప్పేసింది ఇది యాక్టింగ్ అని.
శివాజీ ఇక నీకు ఉంటది :
షకీలాకి ఇచ్చిన సలహా శివాజీ ది అని సభ్యులందరికీ తెలుస్తుంది శివాజీ పైన నెగటివ్ వచ్చింది ఇది వచ్చేవారం నామినేషన్ పైన ప్రభావం చూపుతుంది అనుకుంటున్నా. ఎవరూ యాక్టింగ్ చేస్తున్నారో రియాల్టీగా ఉన్నారో అని చెప్పి అందరికీ మాట్లాడుకుంటున్నారు.
పవర్ అస్త్ర ఎవరికి :
బిగ్ బాస్ సభ్యులందరిని పిలిచి సందీప్, ప్రియాంక ,రతిక ,శివాజీ వీరు నలుగురు పవర్ అస్త్ర సాధించడానికి దగ్గరలో ఉన్నారని వీరిలో ఒకరిని సభ్యులుగా నామినేట్ చేయబడుతారని తెలియజేస్తాడు కానీ ఈ ప్రక్రియ తోటి సభ్యుల పైన ఆధారపడి ఉంటుంది దీనికి అగ్ని పరీక్ష అని పేరు పెట్టాడు.
ఈ అగ్నిపరీక్ష ఏంటంటే వీరిని నలుగురిలో ఎవరు అర్హులు ,అనర్హులు అని నిర్ణయించాల్సి ఉంటుంది.
Bigg boss 7 telugu today episode అగ్నిపరీక్ష రతిక కే :
•శుభశ్రీ రతిక ని అనర్హులుగా ప్రకటిస్తుంది రతిక చేసిన టాస్క్ ఇంప్రెస్గా లేదు అని చెప్తుంది కానీ ఇంటి సభ్యులకు గేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే టఫ్ కంటెంట్ ని టార్గెట్ చేయాలి అంటుంది.
•ప్రశాంత్ ప్రియాంకని అనర్హులుగా ప్రకటిస్తాడు కారణం రైతుబిడ్డ వచ్చాడు అని వెటకారంగా మాట్లాడింది అని.
•దామిని రతిక ని అనర్హులుగా ప్రకటిస్తుంది అందరితో కనెక్ట్ అయితే బాగుంటుంది అని అంటుంది కానీ ఇంటి సభ్యులతో చాలెంజింగ్ లేకుండా ఫైవ్ వీక్స్ ఎలా సేవ్ అయితుంది అందుకే నామినేట్ చేశా అని అంటుంది.
•షకీలా కూడా రతిక ను నామినేట్ చేస్తుంది అందరితో సరిగ్గా కనెక్ట్ కావట్లేదు అని
•అమర్దీప్ శివాజీని నామినేట్ చేస్తాడు కుస్తీ పోటీలో పోటీ ఇవ్వకుండా give up ఇచ్చాడని అందుకని.
•కిరణ్ రతిక ను నామినేట్ చేస్తుంది ఇంట్లో రతిక ను చాలా తక్కువ చూశాను నాకు ఇంట్లో ఎక్కడా కనిపించలేదు అని అంటుంది.
•గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తాడు మీకు ఇచ్చిన టాస్క్ అదే బాత్రూం టాస్క్ ఎవరైనా చేస్తారు అని ఎగతాళిగా మాట్లాడుతాడు.
Bigg Boss 7 Telugu Day 5 ఈ విషయంలో శివాజీకి కోపం వచ్చి నీకు బల్లి టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా చేశావు నాకు తోచినట్టు నేను చేశాను అంతేగాని చులకనగా మాట్లాడొద్దు అని హెచ్చరిస్తాడు అప్పుడు గౌతమ్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు కానీ శివాజీ వినడానికి ఒప్పుకోడు.
•శోభ శెట్టి రితిక ను నామినేట్ చేస్తుంది టాస్క్ అంటేనే నువ్వు గీవ్ అప్ ఇస్తున్నావు నువ్వేంటో నిరూపించుకో అని చాలెంజ్ చేస్తుంది.
రతిక కి కోపం వచ్చి దాక్కోవటం ఒకటే టాస్క్ కాదు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మీకు నేను చెప్పలేను మీరు నన్ను అడగలేదు అని ఇంటి సభ్యులతో గొడవ పడుతుంది ఇంకా చాలా రోజులు ఉన్నాయి చూసుకుందాం అని అంటుంది
•తేజ రతిక ని నామినేట్ చేస్తాడు నువ్వు గేమ్ ఆడే విధానం నాకు నచ్చలేదు అని
•చివరగా ప్రిన్స్ సందీప్ ని నామినేట్ చేస్తాడు నువ్వు కొన్ని విషయాలలో స్టాండ్ తీసుకోవట్లేదు అని కానీ చివరగా నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి నీకు ఫైవ్ వీక్స్ ఇమ్యూనిటీ అవసరం లేదు అది వీక్ కంటెస్టెంట్ కి ఇద్దాం అని.
చివరి పరీక్షకి అర్హులు:
చివరగా బిగ్ బాస్ ఇచ్చిన అగ్ని పరీక్షలో భాగంగా రతిక , శివాజీ అనర్హులుగా ప్రకటించి పోటీ నుండి తప్పుకున్నారు ప్రియాంక సందీప్ తదుపరి పరీక్షకి అర్హులుగా ప్రకటించబడ్డారు అని తెలియజేస్తాడు
Bigg Boss 7 Telugu Day 5 | Bigg Boss 7 Telugu Day 5 h ighlight | Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks
Bigg Boss Telugu 7 Day 04 highlight । నా ఎక్స్ ని మిస్ అవుతున్న : నా లవర్ నా ఎక్స్ లా ఉండాలి .


G’day, legends! I tried slotroyal01 and it was pretty sweet, to be honest. Plenty of slots to choose from and the bonuses don’t seem too shabby. Give it a burl: slotroyal01
[…] Bigg Boss 7 telugu Day 5 Highlights । నీకు నేను ఓకేనా కాదంటే… […]
[…] Bigg Boss 7 telugu Day 5 Highlights । నీకు నేను ఓకేనా కాదంటే… […]