Bigg Boss 7 Telugu Day 8 Highlights । ప్రశాంత్ మొగాడు ఐతే మేం ఏంటి ??

Bigg Boss 7 Telugu Day 8 లో  బిగ్ బాస్ లోని సభ్యులకు బెడ్రూంలు అలాట్ చేశారు కొంతసేపు రతిక తేజ బెడ్ కోసం వాదన పెట్టుకున్నారు. ప్రిన్స్ బెడ్ కోసం వచ్చాక ఇక్కడ గర్ల్స్ ఉండాలి అని చెప్పాక వెళ్లిపోయాడు. చిరంజీవి గారి సాంగ్ “పూనకాలు లోడింగ్” తో మొదలైంది బిగ్ బోస్ 7 తెలుగు డే 8.
వాష్ రూమ్ లో శెట్టి, తేజ క్లీనింగ్ కోసం అరుచుకుంటున్నారు, కడగడంలో అలసిపోయి విసిగిపోయి ఉన్నట్టు ఉన్నారు నాగార్జున వీరిద్దరికీ పెద్ద ఫిట్టింగే పెట్టాడు.

పవర్ అస్త్ర పవర్ డౌన్ :

మళ్లీ ఒకసారి బిగ్ బాస్ 7 తెలుగు డే 8 లో  సందీప్ కి పవర్ అస్త్ర యొక్క ప్రయోజనాలు తెలియజేశాడు దీని వలన వచ్చే ఇమ్యూనిటీ శాశ్వతం కాదు అని బ్యాటరీ డిసైడ్ చేస్తుందని తెలియజేశాడు. బ్యాటరీ వీక్ కాకుండా ఎంటర్టైన్మెంట్, టాస్క్, హౌస్ పార్టిసిపెంట్, ఫియర్లెస్ ,ఒరిజినాలిటీ మీద ఆధారపడి ఉంటాయని తెలియజేస్తాడు.

బిగ్ బాస్ 2వ వారం నామినేషన్లు :

బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని బిగ్ బాస్ సభ్యులకి తెలియజేస్తాడు నామినేట్ సభ్యుని పెట్టలోనికి పంపించి బజర్ నొక్కాలి, తద్వారా వారిపై రెడ్ కలర్ పడుతుంది అని తెలియజేశాడు, Bigg Boss 7 Telugu Day 8 Highlights ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ చేయకపోతే బిగ్ బాస్ వారిని డైరెక్ట్ గా నామినేట్ చేస్తాడు అని హెచ్చరించాడు.

డైరెక్ట్ ఒకరిని నామినేట్ చేయ్యు:

పవర్ అస్త్రాలో భాగంగా సందీప్ కి డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీని ద్వారా సందీప్, ప్రిన్స్ ని నామినేట్ చేశాడు దానికి గల కారణాలు ఇతను గత వారంలో అన్నిట్లో వీక్ గా ఉన్నాడు కాబట్టి నామినేట్ చేస్తున్న అని అంటాడు.

దానికి ప్రిన్స్ నువ్వు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నావు అంటే నేను టార్గెట్ చేయాలనుకుంటే ప్రశాంత్ ని చేస్తాను నిన్ను చేయాలని అనుకోను ఎందుకంటే స్ట్రాంగ్ కంటెంట్ ని నామినేట్ చేస్తాను నిన్ను చేయను.

Bigg Boss 7 Telugu Day 8 Highlights టేస్టీ తేజ నామినేషన్ :

తేజను నామినేట్ చేసేవాళ్లు మొదటగా శుభశ్రీ కారణాలు నీవు అందరితో బాగుంటావు సంతోషంగా ఉంటావు కానీ గేమ్ పరంగా వర్క్ పరంగా ఇంప్రెస్స్ గా ఉండలేక పోతావు ఎవరు ఏం పని చెప్పినా లేజీగా ఉంటావు అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని అంటుంది అందరితో పోలిస్తే తక్కువ చేస్తానేమో కానీ ఎంతో కొంత చేస్తాను కదా అని తేజ కౌంటర్ ఇస్తాడు

తర్వాత రతిక, తేజనీ నామినేట్ చేస్తూ బిగ్ బాస్ లో లేజీగా ఉంటావు చలాకిగా ఉండాలని నామినేట్ చేశాను మరి నీ భాష బాగోలేదు నన్ను ఏం పీకుతున్నావ్ అన్నావు నాకు నచ్చలేదు మరి నువ్వు కూడా అన్నావు కదా తిని తొంగుంటావని అన్నప్పుడు నేను అంటే తప్పేంటి అని తేజ కౌంటర్ ఇస్తాడు.

Bigg Boss 7 Telugu Day 8 Highlights కాదు నువ్వు ఎవరైనా పుష్ చేస్తేనే పనిచేస్తావు తిని పడుకుంటావు నీకోసమే నువ్వు యాక్టివ్ గా ఉండాలని నామినేట్ చేశాను. నేను నువ్వు చెప్పితే మారితే తేజ ఎందుకు అవుతాడు.

దామిని నామినేషన్స్ :

దామిని నామినేట్ చేసేవారు ఎవరూ లేక తిరిగి వెళ్ళిపోతుంది
శుభశ్రీ ప్రిన్స్ గుసగుసలాడుతూ ఉంటే బిగ్ బాస్ శుభశ్రీని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శుభశ్రీ మీరు శివాజీని నామినేట్ చేస్తున్నారా అని ప్రిన్స్ అడుగుతున్నాడు బిగ్ బాస్ అని అంటే నేను చేయట్లేదు అని చెప్పాను అని అంటుంది.

బిగ్ బాస్ 7 తెలుగు డే 8 శివాజీ నామినేషన్లు :

శివాజీని వచ్చి నామినేషన్ పిట్ లో నిలబడమంటాడు. శివాజీ పెట్లోకి వెళ్తూనే ఎవరికైనా సెకండ్ నామినేషన్ ఆప్షన్ లేకపోతే నన్ను నామినేట్ చేసుకోవచ్చు, నేను ఏమి అనుకోను అంటూ ఉంటాడు.

శివాజీనీ నామినేట్ చేయడానికి వస్తాడు అమర్ దీప్, మీరు వేరే వాళ్లకు సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ప్రశాంత్ నీ, వాడు మగాడు వాడు టైగర్ వాడి దగ్గర సబ్జెక్టు ఉంది, ఫోకస్ ఉన్నడో అంటే నేను పేకాడడానికి వచ్చానా , వాడు మగాడు ఇతే నేనే ఏంటి?  ఇలాంటి మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని మీరు ఎక్కడ తక్కువ చేస్తున్నారో, మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు అనిపిస్తుంది అంటాడు అమర్.

తర్వాత Bigg Boss 7 Telugu Day 8 లో శివాజీని నామినేట్ చేయడానికి వస్తుంది ప్రియాంకా, శివాజీ గారు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కానీ మీరు అదే రెస్పెక్ట్ మాకు ఇవ్వడం లేదు ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడనివ్వడం లేదు ఏదైనా మాట్లాడుతుంటే మధ్యలోనే ఆ మాటను కట్ చేసేస్తున్నారు, మా మాటలు పూర్తిగా విని మీరు మాట్లాడితే బాగుంటుంది అంటూ నామినేట్ చేస్తుంది ప్రియాంక. నేను బిగ్ బాస్ తప్ప ఎవరి మాట వినను అని తేల్చి చెప్తాడు శివాజీ. పైనుండి వాటర్ పడుతూ ఉంటే పచ్చని చిలుకలు తోడుంటే పాట పాడుతు డాన్స్ చేస్తాడు శివాజీ. అయిపోయిందా పో ప్రియాంక అంటాడు శివాజీ. మీరెవరు నన్ను పొమ్మనడానికి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను రెస్పెక్ట్ కాపాడుకోండి అంటుంది ప్రియాంక. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హౌస్ నీ మేనేజ్ చేస్తున్నావ్ నువ్వు చెప్పినట్టే హౌస్ వినాలని మెల్లగా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావ్ అంటాడు శివాజీ.

తర్వాత శివాజీ నామినేట్ చేయడానికి వచ్చిన షకీలా, Bigg Boss 7 Telugu Day 8 Highlights అన్న మీరు ఉంటే మీ మైండ్ గేమ్ తో నేను ఆడుతున్నట్టు ఉంది. మీరుంటే నేను నా మైండ్ తో గేమ్ ఆడనేమో, మీరు స్ట్రాంగ్ అందుకే నామినేట్ చేస్తున్నాను అంటుంది. 

శోభ నామినేట్ చేయడానికి వస్తే మా చెల్లి వచ్చిందంటడు … ఆప్షన్ లేకపోతే ఎవరైనా వచ్చి నన్ను సెకండ్ నామినేట్ చేసుకోవచ్చని చెప్పడం నాకు నచ్చలేదు అది మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటుంది శోభా శెట్టి. మీరు పల్లవి ప్రశాంత్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు మీకు తెలుసా తన పూర్ అని, నేను అదే పూర్ ఫ్యామిలి నుంచి వచ్చాను, నాది కర్ణాటక అయితే కావచ్చు గాని మా నాన్న కూడా ఫార్మరే ఇప్పటికీ ఫామింగ్ చేస్తారు , మాది చాలా చిన్న ఫ్యామిలీ మీకు తెలియదేమో అంటుంది కానీ శివాజీ ఆమె మాట వినడు సరే తల్లి నిన్ను ఇప్పటినుంచి నేను ఏమన్నా అంటాడు. నువ్వు చేసే ఓవరాక్షన్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటది అన్న ఇలా ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడడం మాకు నచ్చట్లేదు అంటుంది. బిగ్ బాస్ 7 తెలుగు డే 8.

( ఇది చదవండి : శోభ శెట్టి బయోగ్రఫీ ,వికీ , వయస్సు , ఇలా చాలా విషయాలు

శివాజీ నామినేట్ చేయడానికి దామిని వచ్చి నాకు మూడు రిజల్ట్స్ ఉన్నాయన్న అని చెప్తుంది. షకీలాతో అలా అలా దయ్యం లాగా చేయించి ప్రాంక్ చేయడం, మెంటల్ హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్తుంది దామిని. అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు ఇది బిగ్ బాస్ చాలా మంది డాక్టర్లు ఉంటారు ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళు ముందే రియాక్ట్ అవుతారు అంటాడు శివాజీ. రెండవ పాయింట్ మీరు కిచెన్ లో అస్సలు కనిపించట్లేదు అని దామిని అంటే అందరూ వంట పని చేయరు. నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను అంటాడు శివాజీ . 3వ పాయింట్ అప్పుడప్పుడు కిచెన్ లోకి వస్తూ ఏం రోగం అమ్మ ఏం మాయ రోగం అమ్మ అంటూ మాట్లాడుతారు అలాంటి వర్డ్స్ నేను తీసుకోలేనని అంటుంది దామిని. అప్పుడు దామిని శివాజీ చేసిన పంచ్ మామూలుగా ఉండదు పొద్దున ఒక మాట విన్నాను ఎవరో F*c* అన్నారు అంటాడు. అది నేనే అన్నానని దామిని ఒప్పుకుంటుంది. అంతకుమించి ఎక్కువ మాట్లాడడు శివాజీ. ఏమి రోగము అనే వర్డ్స్ నచ్చవని చెప్పిన దామినికి, ఇలాంటి మాట ఎందుకు వాడవని చెప్పకనే చెప్తాడు.

స్టార్ మా బ్యాచ్ :

Bigg Boss 7 Telugu Day 8 లో నామినేషన్ బ్రేక్ లో తన బాధను అందరికీ చెప్తూ ఏడుస్తుంది ప్రియాంక. అక్కడ శివాజీ మీద అందరూ కోపంతో ఊగిపోతూ ఉంటే, మండుతున్న మంట లో  పెట్రోల్ పోసినట్టు మీ అందరిని శివాజీ స్టార్ మా బ్యాచ్ అన్నాడని వచ్చి చెప్తుంది దామిని, దాంతో అక్కడ స్టార్ మా లో పనిచేసిన శోభ శెట్టి, ప్రియాంక వీళ్ళందరూ ఊగిపోతూ ఉంటారు…

హలో ప్రశాంత్ నిన్ను పిలిస్తే ఎంత వర్షం పడుతుందో పైనుంచి అంటాడు శివాజీ, ఏమో అన్న కుప్పలు కుప్పలు వస్తారేమో మీదికి అంటాడు పల్లవి ప్రశాంత్. అనడంతోనే నెక్స్ట్ నామినేషన్ కి రెడీ అవ్వండి ప్రశాంత్ అంటాడు బిగ్ బాస్.

ప్రశాంత్ నామినేషన్స్ :

ప్రశాంత్ వచ్చి పిట్ లో నిలబడగానే గౌతమ్ కృష్ణ వచ్చి నువ్వు రైతు బిడ్డని అని బయటకి పొట్రే చేస్తున్నావ్, నీకు మాకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది నువ్వు ఒక్క పోస్ట్ చేసిన లక్ష రూపాయలు ఇచ్చేందుకు రెడీగా వస్తారు అంటూ గౌతం మాట్లాడుతూ ఉంటాడు. గౌతమ్ చెప్పలనుకున్న పాయింట్స్ ప్రశాంత్ కి సరిగ్గా అర్థం అవడం లేదేమో అనుకొని ఇంటి సభ్యులు తేజ, అమర్దీప్ ఇన్వాల్వ్ అవుతారు. అన్నా మీరు మాట్లాడొద్దు అన్న చెప్పాలనుకుంటుంది చెప్తుండు చెప్పనివండి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటూ ప్రశాంత్ అనడంతో ఇంటి సభ్యులందరూ సైలెంట్ గా ఉంటారు. కానీ ఈ నామినేషన్లో ప్రశాంత్ మీద ఉన్న కోపం ప్రశాంత్ కి ఎంత మంది వ్యతిరేకంగా ఉన్నారో అని అతనికి అర్థమైపోయి ఉంటుంది. బయటకు పోదామన్న ఒక్క పోస్ట్ కి లక్ష ఇప్పిస్తా అన్నావుగా ఇప్పియ్యు అన్న, నేను అది తీసుకుపోయి ఎవరైనా పేద రైతుకి ఇస్తానని చెప్తాడు ప్రశాంత్.

తర్వాత నామినేట్ వేయడానికి దామిని వస్తుంది ప్రశాంత్ నాకు ఎంతమంది అక్క చెల్లెలు చెప్పమంటే ప్రశాంత్ నాకు తెల్వదు అక్క అంటాడు. కానీ నీకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు అని చెప్తుంది దామీని. నువ్వేంటో , నీ పరిస్థితి ఏంటో, నీ చుట్టూ జరుగుతుందెంటో మాకు చెప్తూనే ఉన్నావు, కానీ మా ఒక్కరి గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నాను అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటుంది దామిని.

ఉన్నది చెప్పండి Bigg Boss 7 Telugu Day 8 లో Bigg Boss 7 Telugu Day 8అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారని ప్రశాంత్ అనడంతో గౌతమ్ కలుగజేసుకొని ఇతనికి పర్సనాలిటీ డిజాస్టర్ అనే రోగం ఉంది . అంటే అందరూ చెప్పేది తప్పు తనదే కరెక్ట్ అనుకోవడం అంటాడు గౌతం . ప్రియాంకా అతన్ని ఆపుతుంది.

ప్రశాంత్ నామినేరే చేయడానికి తర్వాత టెస్ట్ తేజ వస్తాడు అది నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నానంటూ నిన్ను చూసి కొట్టలేదు కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావ్ అన్న, నున్ను చూసి కొట్టేమైనా గొడవ పడిందాం దా అన్నట్టు ఏమన్నా అన్నానా అని అడుగుతాడు ప్రశాంత్. అరే ప్రశాంత్ పాత నామినేషన్ అయిపోయింది నిన్ను జనాలు గెలిపించారు ఎక్కువ మాట్లాడకురా లైట్ తీసుకో అంటాడు శివాజీ . మాట్లాడేది ప్రశాంత్ కి అర్ధమవ్వడం లేదు బిగ్ బాస్ ఎవరినైనా ట్రాన్స్లేటర్ ని పంపించండి అంటాడు టేస్టీ తేజ.

ప్రియాంక ప్రశాంత్ ని నామినేట్ చేయడానికి వచ్చి, ఇప్పుడు మీ దగ్గర కనిపిస్తున్న ధైర్యం ఇప్పటివరకు కనిపించలేదు నువ్వు మొన్న టాస్క్ లో కూడా ఈ దైర్యం నీ దగ్గర కనిపించలేదు. Bigg Boss 7 Telugu Day 8 లో ఇప్పుడు నామినేషన్ వేస్తున్నప్పుడే నీలో ధైర్యం కనిపిస్తుంది. ఇలాంటి ధైర్యం ఎప్పుడూ నీకు ఉండాలని, ముందు వారు చెప్పేది వినాలని చెప్తుంది ప్రియాంక.

షకీలా వచ్చి నాకు ప్రశాంత్ ఎక్కువగా ఇంట్లో కంటికి కనిపించడం లేదు అందుకే నామినేట్ చేస్తున్నాను అంటుంది షకీలా.

తర్వాత బిగ్ బాస్ 7 తెలుగు డే 8 లో  అమరదీప్ నామినేట్ చేయడానికి వస్తాడు. ప్రశాంత్ పుష్ప స్టైల్ లో భుజం లేపి ఉంచడంతో భుజం దించు అని వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇదే స్టైల్ లో వీడియోస్ చేసి బిగ్ బాస్ కు వస్తానని ఎందుకు చెప్పలేదు ఇప్పుడెందుకు ఈ స్టైల్ లో ఉంటున్న అసలైన ప్రశాంత్ నీ చూడాలని ఉంది అంటాడు అమర్ దీప్ . నాకసలైన ప్రశాంత్ నీ చూడాలని ఉంది నువ్వు సమయానికి స్విచ్ అవుతూ ఉంటున్నావ్. నీకు లక్ష వస్తే రైతుకు మాత్రమే ఇస్తానన్నావ్ , బీ.టెక్ చేసినొడి కష్టాలు నీకు తెలుసా అంటూ రఘువరన్ బీ. టెక్ సినిమాలో డైలాగ్ చెప్పి, అందరికీ బాధలు ఉంటాయి అని చెప్తాడు అమర్ దీప్. వీళ్ళ మధ్య మాటల యుద్ధం బాగానే జరుగుతుంది . పల్లవి ప్రశాంత్ కి 6 నామినేషన్లు పడ్డాయి . ఇది ఈరోజు ఎపిసోడ్ రసవత్రంగా సాగింది. చూడాలి రేపటి ఏపిసొడ్ లో ఏం జరగబోతుందో…. నామినేషన్ తరువాత ఓటింగ్ కింద లింక్ ద్వారా వేయండి .

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top